![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -59 లో... శ్రీధర్ తన లవర్ తో మాట్లాడుతుంటే.. కార్తీక్ వస్తాడు. దాంతో శ్రీధర్ కంగారుగా ఫోన్ కట్ చేస్తాడు. ఏంటి కంగారు పడుతున్నారు ఏదయినా సీక్రెటా అని కార్తీక్ అడుగుతాడు. అదేం లేదు అని శ్రీధర్ అనగానే అలా అయితే మీరు మాట్లాడిన లాస్ట్ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడొచ్చా అని కార్తీక్ అడుగుతాడు. నాపై నమ్మకం లేకపోతే మాట్లాడమని శ్రీధర్ తెలివిగా తప్పించుకుంటాడు. ఆ తర్వాత మీపై నమ్మకం లేకపోవడం.. ఏంటని కార్తీక్ అంటాడు.
కార్తీక్ వెళ్తుంటే మీ అమ్మ భోజనం చేసిందో లేదో కనుక్కోమని శ్రీధర్ అనగానే.. మీలో నచ్చేదే ఈ క్వాలిటీ.. అమ్మని చాలా బాగా చూసుకుంటారు.. బెస్ట్ హస్బెండ్. నాకు పెళ్లి అయితే మీ అంత బాగా చూసుకోలేనని కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు. మీ పిన్ని గురించి తెలిస్తే వరెస్ట్ హస్బెండ్ అని అంటావ్. ఈ విషయం ఎప్పటికి నీకు తెలియకూడదని శ్రీధర్ అనుకుంటాడు.
మరొకవైపు శౌర్య అలిగి అన్నం తినకుండా ఉంటుంది. ఆకలిగా ఉందని అనుకుంటుంది. అప్పుడే దీప వచ్చి శౌర్యని సరదాగా అటపట్టిస్తుంది. ఆ తర్వాత శౌర్యకి దీప భోజనం తినిపిస్తూ.. దీప నాన్న గురించి చెప్తూ ఎమోషనల్ అవుతుంది. మరుసటిరోజు శౌర్య స్కూల్ కి రెడీ అవుతుంది. నోట్స్ పై నువ్వు పేరు రాయి అని దీపకి చెప్తుంది. దీప రాస్తుంటే.. కార్తీక్ మంచివాడంటూ శౌర్య మాట్లాడుతుంది. దాంతో నర్సింహ కార్తీక్ గురించి అన్నమాటలు గుర్తుకుచేసుకుంటుంది దీప. కాసేపటికి నాకు పాట నేర్పించమని శౌర్య అనగానే.. శౌర్యకి పాట నేర్పిస్తుంది దీప. అప్పుడే కార్తీక్ వస్తాడు. దీపకి ఈ ట్యాలెంట్ కూడా ఉందా అని అనుకుంటాడు.
ఆ తర్వాత సుమిత్ర, కాంచనలు మాట్లాడుకుంటుండగా.. ఆవకాయ పెట్టాలని కాంచన అనగానే.. దీప బాగా పెడుతుందంట అని దీపని సుమిత్ర రప్పిస్తుంది. ఆవకాయ పెడుతానని దీప చెప్తుంది.. ఆ తర్వాత మీ నాన్నేంటి నిన్న కంగారుగా వెళ్ళాడని దశరథ్ అడుగుతాడు. ఎక్కడా నిజం భయటపడుతుందోనని వెళ్ళాడని దీప అనుకుంటుంది. ఎక్కడ రహస్యం భయటపడుతుందోనని వెళ్ళాడని కార్తీక్ అనగానే.. అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |